Folgen

  • "పర్యావరణ రక్షణే.. మానవ మనుగడకు సురక్ష" - ప్రసాద్ జాలాది | Special Interview
    Feb 2 2026

    పర్యావరణ పరిరక్షణ గురించి మనం రోజూ ఎన్నో మాటలు వింటూ ఉంటాం.. కానీ ప్రకృతిని కాపాడుకోవడాన్ని ఒక బాధ్యతగా తీసుకుని, మంచి భవిష్యత్తు కోసం అడుగులు వేస్తోంది సురక్ష ఫౌండేషన్. ఈ సంస్థ వ్యవస్థాపకుడు, చీఫ్ ఫెసిలిటేటర్ ప్రసాద్ జాలాది గారు, ఒక సోషల్ ఎంట్రప్రెన్యూర్‌గా ఆయన ప్రయాణం, పర్యావరణ పరిరక్షణలో తీసుకొస్తున్న మార్పులు,'సురక్ష' ద్వారా చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు. రేపటి తరం కోసం మనం చేయాల్సిన కృషిని గుర్తుచేసే ఈ విశేషాలను తప్పకుండా వినండి! అస్సలు మిస్ అవ్వకండి!


    We often hear many talks about protecting the environment. But Suraksha Foundation is turning these words into action and working responsibly for a better future. In this podcast, the founder and Chief Facilitator Prasad Jaladi shares his journey as a social entrepreneur, the positive changes he is bringing to environmental protection, and the various initiatives taken up through Suraksha. These insights remind us of the efforts we must make for the next generation. Do listen, don’t miss it!


    Host: Renu Sree

    Guest: Prasad Jaladi


    #TALRadioTelugu #SocialEntrepreneur #GreenFuture #SaveNature #SustainableLiving #ClimateAction #EcoResponsibility #ForNextGeneration #EnvironmentalAwareness #ChangeMakers #InspiringStories #TALRadio #TouchALifeFoundation

    Mehr anzeigen Weniger anzeigen
    37 Min.
  • "మా ఊరి గంగమ్మ జాతర ఇప్పుడు వరల్డ్ ఫేమస్" - భార్గవి రెడ్డి
    Jan 27 2026

    ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా వారం వారం తిరుమల కొండను ఎక్కిన ఆ అనుభూతులు, ఊరి గుడుల మధ్య గడిపిన తీపి జ్ఞాపకాలు, మనసులో నిలిచిపోయిన మరెన్నో ముచ్చట్లు... వీటన్నింటితో పాటు తిరుపతి లో అత్యంత వైభవంగా జరిగే 'తాతయ్యగుంట గంగమ్మ జాతర' విశేషాలను ఈ ‘మా ఊరు’ ఎపిసోడ్ లో మనతో పంచుకుంటున్నారు తిరుపతికి చెందిన భార్గవి రెడ్డి గారు! ఆ జాతర వెనుక ఉన్న కథ ఏంటి, అక్కడి సంప్రదాయాలు ఎలా ఉంటాయి, తన ఊరితో తనకున్న అనుబంధం ఏంటి.. వంటి ఎన్నో విషయాలను పంచుకున్న ఈ ఎపిసోడ్ ను అస్సలు మిస్ అవ్వకండి! తప్పకుండా వినండి...!


    In this “Ma Ooru” episode, Bhargavi Reddy garu from Tirupati shares her sweet childhood memories, her deep connection with her hometown, and the joy of climbing Tirumala with friends, while also explaining the story, traditions, and cultural importance of the grand Tataiyyagunta Gangamma Jatara celebrated in Tirupati.


    Guest: Bhargavi Reddy

    Host: Usha

    #TALRadioTelugu #MaOoru #Tirupati #GangammaJatara #TirupatiStories #CultureAndTradition #PodcastEpisode #LocalVoices #OurRoots #TALRadio #TouchALifeFoundation

    Mehr anzeigen Weniger anzeigen
    32 Min.
  • "మాట్లాడటం మొదలు పెడదాం" - అనూష భరద్వాజ్ | స్ఫూర్తి కిరణాలు
    Jan 25 2026

    ప్రతి అమ్మాయి తన కలలను నిజం చేసుకునే ధైర్యాన్ని, నాయకత్వ లక్షణాలను సాధించాలనే గొప్ప లక్ష్యంతో వేలాది మంది గ్రామీణ బాలికల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నారు 'VOICE 4 Girls' ఫౌండర్ అనూష గారు. గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలను అడ్డుకుంటూ, లైంగిక ఆరోగ్యం మరియు లైఫ్ స్కిల్స్‌పై అవగాహన కల్పిస్తూ వారు చేస్తున్న ఎన్నో పనుల గురించి, బాలికా సాధికారత కోసం ఆ సంస్థ సాగిస్తున్న అద్భుత ప్రయాణం గురించి ఈ నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు. రేపటి తరాన్ని ప్రభావితం చేసే ఈ విశేషాలను అస్సలు మిస్ అవ్వకండి.. తప్పకుండా వినండి!


    Anusha, the founder of VOICE 4 Girls, is bringing new hope into the lives of thousands of rural girls with the vision of helping every girl build confidence, leadership skills, and the courage to achieve her dreams. By preventing child marriages and creating awareness about sexual health and life skills in rural areas, her organization is making a powerful impact. On this National Girl Child Day, she shares the inspiring journey of VOICE 4 Girls and its mission for girl empowerment in this podcast. Don’t miss it, do listen.


    Guest: Anusha Bharadvaj

    Host: Rama Iragavarapu


    #TALRadioTelulgu #Voice4Girls #GirlChildDay #GirlsEmpowerment #RuralEducation #WomenLeadership #InspiringStories #SocialImpact #PodcastRecommendation #TALRadio #TouchALifeFoundation

    Mehr anzeigen Weniger anzeigen
    31 Min.
  • "వైకల్యం ఉన్న పిల్లలకు సానుభూతి కాదు సపోర్ట్ ఇవ్వాలి" - మాధవీలత | Special Interview
    Jan 22 2026

    గత 25 ఏళ్లుగా ఎంతో మంది దివ్యాంగ పిల్లలకు అమ్మగా మారి అండగా నిలుస్తూ, కొత్త జీవితాన్ని ఇస్తున్నారు ఆశాజ్యోతి డైరెక్టర్ మాధవిలత గారు. కేవలం ఆశ్రయం మాత్రమే కాకుండా, వారికి ఫిజియోథెరపీ, వొకేషనల్ ట్రైనింగ్ ఇస్తూ సమాజంలో గౌరవంగా బతికేలా ఆమె ఎంతో కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సంస్థ చేస్తున్న ఈ సేవలు, పిల్లల విజయగాథల గురించి మాధవిలత గారు ఈ పాడ్కాస్ట్ లో పంచుకుంటున్నారు. తప్పకుండా వినండి!


    For the past 25 years, Madhavilatha Garu, Director of Ashajyothi, has been a mother and strong support to many children with disabilities, giving them a new life. Her organization not only provides shelter, but also offers physiotherapy and vocational training, helping the children live with dignity and confidence in society. In this podcast, Madhavilatha Garu shares the inspiring work of the institution and the success stories of these children. Do listen!


    #TALRadioTelugu #AshaJyothi #MadhaviLatha #DivyangChildren #SpecialChildren #InclusiveSociety #DisabilitySupport #ChildCare #Physiotherapy #VocationalTraining #Empowerment #SocialService #WomenWhoInspire #LifeChangingStories #TALRadio #TouchALifeFoundation

    Mehr anzeigen Weniger anzeigen
    40 Min.
  • నేటి యువత ఆయుర్వేదం వైపు ఎందుకు మొగ్గు చూపుతోంది? | Ayurvedam Arogyam - 91
    Jan 21 2026

    ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ఎంతగా పెరిగినా, దాన్ని ఆదరిస్తూనే… ఆధునిక జీవనశైలి వల్ల వచ్చే సమస్యలకు సహజ సిద్ధమైన పరిష్కారాలను వెతుక్కుంటూ యువత ఆయుర్వేదం వైపు ఆసక్తి చూపుతోంది. అసలు ఆయుర్వేదంలో యువతను అంతగా ఆకర్షిస్తున్న అంశాలు ఏమిటి? రోజూ వారి జీవితంలో ఆయుర్వేదాన్ని పాటించడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వొచ్చు? వంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ ప్రత్యేక పాడ్కాస్ట్ లో ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డా. అనుపమ ఉప్పులూరి గారు వివరిస్తున్నారు. తప్పక వినండి. అస్సలు మిస్ అవ్వకండి!


    Despite rapid technological growth, many young people are turning to Ayurveda to find natural ways to deal with modern lifestyle problems. In this special podcast, renowned Ayurvedic doctor Dr. Anupama Uppuluri talks about why Ayurveda appeals to today’s youth and shares easy tips to include it in daily life. It’s an informative and engaging discussion you shouldn’t miss.

    #TALRadioTelugu #Ayurveda #YouthAndWellness #NaturalHealing #HealthyLifestyle #PodcastRecommendation #MindBodyBalance #AncientWisdom #ModernLife #TALRadio #TouchALifeFoundation

    Mehr anzeigen Weniger anzeigen
    28 Min.
  • "సమస్య ఉన్న ప్రతి మహిళకి నేను తోడుంటా" - విజయలక్ష్మి | Special Interview
    Jan 20 2026

    ఎల్లప్పుడూ మహిళల ఆరోగ్యం కోసం, వారి సంక్షేమం కోసం ఆలోచిస్తూ.. మహిళల కోసమే జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి విజయలక్ష్మి గారు. చదువు ఒక్కటే సమాజాన్ని మార్చగలదని, సమస్యలను తీర్చగలదని నమ్మి, పెళ్లి అయినా తర్వాత LLB చదివి లాయర్ పట్టా పొందారు. ప్రస్తుతం ఉమెన్ అండ్ చైల్డ్ డెవెలప్మెంట్ డిపార్ట్మెంట్ లో వృత్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈమె.. మహిళలు వారి జీవితంలో ఎదుర్కొనే సమస్యల గురించి, వాటి పరిష్కారాల గురించి ఎన్నో విషయాలను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు… తప్పకుండా వినండి. అస్సలు మిస్ అవ్వకండి!


    Ms. Vijayalakshmi has devoted her life to improving women’s health and overall well-being. She believes that education is the key to creating positive change in society. After getting married, she continued her studies, completed her LLB, and became a lawyer. She is currently serving in the Women and Child Development Department. In this podcast, she openly talks about the real-life problems women face and shares meaningful guidance and solutions. This is a must-listen podcast. Don’t miss it.


    #TALRadioTelugu #WomensHealth #WomenEmpowerment #EducationForChange #InspiringWomen #WomenAndChildDevelopment #SocialImpact #WomenWelfare #RealLifeHeroes #TALRadio #TouchALifeFoundation

    Mehr anzeigen Weniger anzeigen
    42 Min.
  • "ఆర్గాన్ డొనేషన్ కోసం మాట్లాడడానికి ఇప్పటికీ ఆలోచిస్తున్నారు" - లలిత రఘురామ్ | Special Interview
    Jan 19 2026

    అవయవ దానం గురించి మన సమాజంలో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో అపోహలూ! కానీ వాటన్నింటికీ సరైన సమాధానం చెబుతూ, ప్రాణదానం పట్ల మన బాధ్యతను గుర్తు చేస్తున్నారు మోహన్ ఫౌండేషన్ డైరెక్టర్ లలిత రఘురామ్ గారు. మనం తీసుకునే నిర్ణయం ఎంత ముఖ్యమైనదో… మనం వెళ్ళిపోతూ కూడా ఇంకొకరి జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేయవచ్చో వంటి విషయాలను, అలాగే అవయవ దానం గురించి మోహన్ ఫౌండేషన్ చేస్తున్న ప్రయత్నాలను, వారి కార్యక్రమాలను గురించి ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు. తప్పకుండా వినండి! అస్సలు మిస్ అవ్వకండి!


    Organ donation is often surrounded by doubts and misconceptions in our society. In this podcast, Lalitha Raghuram, Director of the Mohan Foundation, talks about the real meaning of organ donation and why it is a responsibility we all share. She explains how a single decision can save lives even after we are gone and shares insights into the impactful work and initiatives of the Mohan Foundation. It’s an inspiring conversation that encourages thoughtful action. Definitely worth listening to.


    Guest: Lalitha Raghuram

    Host: Rama Iragavarapu


    #TALRadioTelugu #OrganDonation #DonateLife #SaveLives #MohanFoundation #LifeAfterLife #Awareness #Podcast #HealthAwareness #Humanity #TALRadio #TouchALifeFoundation

    Mehr anzeigen Weniger anzeigen
    55 Min.
  • "You 2.0: 2026లో మిమ్మల్ని మీరు కొత్తగా మార్చుకోండిలా" - బి. కృష్ణ భరత్ | Special Interview
    Jan 16 2026

    ప్రపంచాన్ని గెలవడానికి ప్రయత్నించే మనం, ఒక్కోసారి మనల్ని మనం గెలవడం మర్చిపోతుంటాం. ఈ కొత్త ఏడాదిలో క్యాలెండర్ తో పాటు మన ఆలోచనలను కూడా మార్చుకుని, 'థ్యాంక్ ఫుల్ నెస్, డిజిటల్ డిటాక్స్, అంతరంగ ప్రయాణం' వంటి సూత్రాలతో మనలోని You 2.0 వర్షన్ ను ఆవిష్కరించుకోడానికి ప్రముఖ సైకాలజిస్ట్ బి. కృష్ణభరత్ గారు ఎన్నో మంచి విషయాలను, సూచనలను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు… తప్పక వినండి… అస్సలు మిస్ అవ్వకండి!


    While trying to conquer the world, we often forget to conquer ourselves. In this new year, along with changing the calendar, let us also change our way of thinking. With principles like thankfulness, digital detox, and inner journey, renowned psychologist B. Krishnabharat shares many valuable insights and practical suggestions in this podcast to help us discover our You 2.0 version. Do listen to it. Don't miss it!


    #TALRadioTelugu #You20 #SelfGrowth #NewYearMindset #InnerJourney #DigitalDetox #Thankfulness #MentalWellbeing #Mindfulness #PsychologyTalks #LifeLessons #PersonalTransformation #PodcastEpisode #TALRadio #MustListen #TALRadio #TouchALifeFoundation

    Mehr anzeigen Weniger anzeigen
    23 Min.